

జనం న్యూస్ జనవరి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కూకట్ పల్లి బాగ్ అమీర్ బంగారు మైసమ్మ గుడి పక్కన ఉన్న వార్డ్ ఆఫీస్ ఎదురుగా 76వ భారత గణతంత్ర దినోత్సవము సందర్బంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండావందనం సమర్పించారు, ఈ కార్యక్రమంలో గుందడి యాదగిరి, దండే అశోక్, ఆకుల వీరస్వామి, కొట్టే వీరస్వామి, బాలకృష్ణ, మహేష్, హర్షవర్ధన్, బాగ్ అమీర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్, మరియు వారి సిబ్బంది, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు పాఠశాల పిల్లల తదితరులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించి, జెండా వందనం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు