Listen to this article

జనం న్యూస్ జులై 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ లోని బుందల్ ఘాట్ బ్రిడ్జి సమీపంలో పేకాట ఆడుతున్నట్టు విశ్వాసనీయ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆసిఫాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. నిందితుల నుండి ₹6,800 నగదు, 52 పేకాట కార్డ్స్,మూడు స్మార్ట్ మొబైల్స్, 1 కోమ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బొట్టుపల్లి పురుషోత్తం (తండ్రి :బాపు,వయసు: 35 సం. మోతుగూడ,ఆసిఫాబాద్.) . ఉడుతల భీమయ్య (తండ్రి :బంగారి, వయస్సు :56 సం. కమన,వాంకిడి )
ఇమ్రాన్ ఖాన్ (తండ్రి: అష్రఫ్ ఖాన్,వయస్సు :30 సం., కసబ్ వాడ, ఆసిఫాబాద్) . గౌస్ సిద్ధికి (తండ్రి: ఆలీబాబా, వయస్సు :22 సం., సందీప్ నగర్ ఆసిఫాబాద్) ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కానిస్టేబుల్స్ దేవేందర్, సంజీవ్, స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పేకాట వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా పేకాట, మట్కా, జూదం లాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహించిన, నిషేధిత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు సేవించిన సరఫరా చేసిన స్థానిక పోలీస్ స్టేషన్ లో లేదా, డయల్ 100 ద్వారా లేదా 8712670551 నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని, వివరాలు తెలిపిన వారి విషయాలు గోప్యం గా ఉంచబడతాయని ఎస్పీ అన్నారు.