

జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ప్రతిభ కనబర్చినందుకు ‘బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టీసెస్ అవార్డు’ అందుకున్ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మరియు బెటాలియన్ కమాండెంట్w మాలిక గార్గ్, ఐపిఎస్ గార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ చేతుల మీదుగా తుమ్మలపల్లి కళా క్షేత్రంలో అవార్డుల ప్రధానం సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించినందుకుగాను రాష్ట్ర ఎన్నికల కమీషనరు ‘బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టీసెస్ – 2024’ అవార్డులను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు మరియు ఎపిఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి మాలిక గార్గ్, ఐపిఎస్ గార్లకు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కే.విజయానంద్, ఐఎఎస్ గారి చేతుల మీదుగా జనవరి 25న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో అందుకున్నారు.
ప్రస్తుతం విజయనగరం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న వకుల్ జిందల్ 2024 సం.లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సమయంలో బాపట్ల జిల్లా ఎస్పీగా సమర్ధవంతంగా విధులు నిర్వహించి, ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను ప్రత్యేకంగా ‘సమర్ధ’ అనే మొబైల్ యాప్ ను ప్రత్యేకంగా రూపొందించి, ఎన్నికల నిబంధనలు సక్రమంగా అమలయ్యే విధంగాను, ఎన్ఫోర్సుమెంటు కేసులు నమోదు చేసి, రాష్ట్ర స్థాయిలో అప్పటి ఎన్నికల కమీషనరు నుండి ప్రశంసలు పొందారు. అదే విధంగా ప్రస్తుతం విజయనగరం ఎపిఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్గా పని చేస్తున్న మాలిక గార్గ్ పల్నాడు జిల్లాలో ఎన్నికలను సమర్ధవంతంగా, ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సమయంలో పల్నాడు జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో అర్ధంతరంగా అప్పటి ఎస్పీని ఎన్నికల కమీషనరు బదిలీ చేయడంతో, పల్నాడు జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల్లోనే జిల్లాలో అన్ని పోలీసు స్టేషనులను సందర్శించి, ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు చేపట్టి, ఎన్నికలు ప్రశాంతయుత వాతావరణంలో ముగిసే విధంగా సమర్ధవంతంగా పని చేసి, ప్రజలు, అధికారుల మన్ననలు పొందారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన అధికారులను రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ వివేక్ యాదవ్, ఐఎఎస్ గారు ఎంపిక చేసి, వారి సేవలను కొనియాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడ తమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టీసెస్ 2024’ గా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్, కమాండెంట్ మాలిక గార్గ్, ఐపిఎస్ లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఐఎఎస్ అవార్డులను ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్, ఐఎఎస్, రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్, అవార్డుకు ఎంపికైన పలువురు ఐఎఎస్ మరియు ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు.