

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 15 రిపోర్టర్ సలికినీడి నాగు
చిలకలూరిపేట లోని అమృత దాబా వద్ద చిలకలూరిపేటలోని పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు పులదండలతోటి, శాలవాళతోటి సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేయటమే కాకుండా, తన కలంతో పలు సమస్యలను వెలికి తీస్తున్నారు గిరిజన సంఘాల ద్వారా గిరిజన ప్రజల ఆర్థిక, సామాజికంగా చైతన్యవంతం చేయటమే కాకుండా గిరిజన ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు మునుముందు గిరిజన ఇతర ప్రజల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాలని నాయకులు అభివర్ణించారు భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అందరు తెలియజేశారు