

జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- అన్యాక్రాంతమైన సిబి సి ఎన్ సి ఆస్తుల పై సిబిసి ఐ డి తో విచారణ చేపట్టాలని ట్రస్టు చైర్మన్ అర్ ఎస్ జాన్ డిమాండ్ చేశారు. శనివారం ఎస్ ఎం బి చర్చి లో 70 వ సర్వ జన నీ మహా సభ నిర్వహించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడలో రిజిస్టర్ కాబడి కోర్టు ద్వారా గుర్తింపు పొందిన ఎం ఎ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ర్ట వ్యాప్తంగా పాల్గొన్న వారంతా ఏక గ్రీవ తీర్మానం చేశారు. బ్రిటిష్ వారి ఏలుబడిలో గ్రేట్ బ్రిటన్ జెండా రెపరెపలాడిన రోజులవి. ఆ సమయంలో మద్రాస్ రెసిడెన్సీ స్టేట్లు తెలుగు తమిళ ఒరియా ప్రాంతాల భాషా ప్రజలు సంయుక్తంగా బ్రిటిష్ వారిచే పరిపాలింప పడుతున్న రోజులవి అప్పటికే అమెరికన్ బాప్టిస్టులు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు స్థాపరంగా ఏర్పరచుకొని 1835 సంవత్సరంలో రామాయపట్నం పరిసర ప్రాంతాలలో పరిచర్యలు కొనసాగిస్తున్న శుభదినాల అటువంటి సమయంలో సిపిఎం మిషన్ సోంపేట నుండి అవనిగడ్డ వరకు అనేక బాప్టిస్ట్ సంఘాలను అనేక ఆస్తులను సంపాదించింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సిపిఎం ఆస్తులను 1975 మద్రాస్ హైకోర్టు తీర్పు ద్వారా సిబిసిఎంసి ట్రస్ట్ అసోసి యేషన్ వారికి బద్రాయించడం జరిగింది అన్నారు ఈ విధంగా సిబిసిఎన్ సి కి దాఖలు చేయబడిన ఆస్తులు 1979 వరకు ఎటువంటి వివాదం లేకుండా కొనసాగింపబడ్డాయని తెలిపారు తదనంతరం ఐక్యతను కోల్పోయి సంస్థ ఔన్నత్యాన్ని నీరుగార్చడం జరిగింది ప్రస్తుతం ఈ పరిస్థితిని స్వార్థపరులైన బాప్టిస్ట్ వారు , బాప్టిస్ట్ నేతలు వారికి అనుకూలంగా వినియోగించుకుంటూ సిపిసిఎల్సి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు కావున ఆస్తులను పరిరక్షించడం అందరి బాధ్యతని ఇందుకోసం ఎంతటి పోరాటాల కైనా తామంత సిద్దమని ప్రకటించారు ఈ సమావేశంలో టి.ఆనంద రావు, జామి శరత్,కుమార్, వై . ప్రభాకర్, బాల చందర్,ఎం రాజకార్ తదితరులు పాల్గొన్నారు