Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు లో 91 ,92 బూత్ పరిధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వ హించారు ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య,టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ లు మాట్లాడుతూ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చెమ్మర్తి జగన్ మోహన్ రాజు సూచన మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నామని అన్నారు.ప్రభుత్వ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ సమస్య పరిష్కారం కోసం యాప్ ద్వారా ప్రభుత్వానికి సమస్యలను పంపించడం జరుగుతుందన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలతోనే ఉంటుందని అన్నారు.అధికారం వచ్చిన ఏడాదికే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామని అన్నారు.