Listen to this article

జనం న్యూస్16-7-2025 అందోల్ నియోజకవర్గం

సంగారెడ్డి జిల్లా ఆషాడ మాసాన్ని పునస్కరించుకొని, ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో మాజీ కౌన్సిలర్ కోరబోయిన నాగరాజు ( నాని) ఆధ్వర్యంలో సోదరీమణులతో, శివసత్తులు నాట్యాలతో, డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాల మధ్య గల్లీ నుండి మధ్యరంగం మీదుగా శ్రీ పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ఊరేగింపు పోతురాజుల నాట్యాలతో పట్టణ పురవీధుల గుండా శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం వద్దకు భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాగరాజు ముద్రాజ్ సంగం అధ్యక్షులు పట్లూరి శివ శేఖర్, డాకురి అశోక్, నాగులపల్లి అంజయ్య, భూతపల్లి సత్యం, నర్సింలు, వీరేశం, నాగులపల్లి యాదగిరి, దశరథ్ డాకూరి గణేష్, పిట్ల లక్ష్మణ్, డాకూ రీ శ్రీశైలం, ఉలువల రమేష్, డాకూరి మల్లేశం, అల్లే రాకేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.