

జనo న్యూస్ 16 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార స్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన గండికోట సాంబయ్య తన గ్రామస్తులైన శీలం బాలరాజు మరియు ఉదరి రాజు లతో కరిసి రాత్రి సుమారు పది గంటలకు గోపాల్పూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వైపు పావురాలు షికారు కోసం వెళ్ళి పచ్చుడూరి ప్రవీణి పొలం వైపు వెళ్తుండగా, అప్పటికె అక్కడ అడవిపందుల కోసం గోపాల్పూర్ గ్రామానికి చెందిన తక్కళ్ళపల్లి చందర్ రావు ప్రోద్బలంతో అదే గ్రామానికి చెందనా పెండ్యాల తిరుపతి, ఎలక తుర్తి గ్రామానికి చెందిన చెందిన బొజ్జ స్వామి, బొజ్జ సతీష్ అడవిపందులను సంహరించడానికి పచ్చు నూరి ప్రవీణ్ పోలo లో ఉన్న విద్యుత్ వోల్ నుంచి తక్కళ్ళపల్లి నర్సింగా రావు పొలం మీదుగా చందర్ రావు పొలం నారూ మడి వరకు విద్యుత్ సరఫరాతో కూడిన వైర్లను అమర్చినాడు. అక్కడ అమర్చిన వైర్లను గమనించనీ సాంబరాజు(మృతుడు) కాళ్ళకు విద్యుత్ వైరు తగలగా అక్కడికక్కడే మృతి చెందినాడు. ఆ సమయం లో వెంట ఉన్న శీల0 బాలరాజు మరియు ఊదరి రాజులు భయంతో అక్కడి నుండి పారిపోయినారు. మరుటి రోజు తెల్లవారు జామున విద్యుత్ వైర్ అమర్చిన పెండ్యాల తిరుపతి, బొజ్జ స్వామి, బొజ్జ సతీష్ లు నేరo తమపైకి రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని చందర్ రావు సూచనల మేరకు పక్కనే ఉన్న మాసిపెద్ది భాస్కర భాస్కర్ రావు వ్యవసాయ బావిలో పడవేసి ఇట్టి సంఘటనను పావురాల షికార్ కోసం వెళ్ళి ప్రమాదవశాత్తుగా బావిలో పడి చనిపోయినట్లుగా చిత్రీకరించాలని చూసినారు, మృతుని భార్య గండికోట మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతుని మరణానికి కారకులైన తక్కళ్ళపల్లీ చందర్ రావు, పెండ్యాల తిరుపతి, బొజ్జ స్వామి, బొజ్జ సతీష్ , శీలం బాలరాజు మరియు ఉదర రాజు లపై కేసు నమోదు చేయనైనది నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం నాడు ఇందిరానగర్ గ్రాముల లోని గోపాల్పూర్ క్లాస్ కోడ్ వద్ద నిందితులను పట్టుకొని విచారించి వారి వద్ద నుండి 3 మోటార్ సైకిల్లు, అడవిపందులను చంపడానికి అమర్చిన కరెంట్ వైర్ (టైండింగ్ వైర్) మరియు కంక బద్దలను స్వాదీనం చేసుకోనైనది. నిందితులను అరెస్టు చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు.నిందితులను పట్టుకోవడం లో ప్రతిభ కనబర్చిన ఎల్కతుర్తి CI పులి రమేష్, ఎల్కతుర్తి SI A. ప్రవీణ్ కుమార్, HCs మల్లేశం, విట్టల్ రావు, బుచ్చి లింగంలు ,PCS బాస్కర్ రెడ్డి, బక్కయ్య, రాజయ్య, సుమన్, రంజిత్, సదానందం లను ఖాజీపేట్ ACP పింగిళి ప్రశాంత్ రెడ్డి అభినందించారు.