Listen to this article

పి ఆర్ టి యు తోనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం


జనం న్యూస్ జూలై16:

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2025 సంవత్సరానికి పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి,కిషన్ మాట్లాడుతూఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు , పదోన్నతులపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించడం జరిగిందని త్వరలోనే ఉపాధ్యాయులు కోరుకునే విధంగా ఆదేశాలు జారీ అవుతాయని, ప్రత్యేక అంశం ఐన2003సంవత్సరం డిఎస్ సి ఉపాధ్యాయులకు ఓ పి ఎస్ కి సంబంధించి క్యాబినెట్ కమిటీ తో చర్చించడం జరిగిందని ఫైల్ ఫైనాన్స్ సెక్రటరీ రాయ రవి దగ్గర ఉందని త్వరలోనే వారు కోరుకున్న విధంగా న్యాయం జరుగుతుందని, అలాగే రానున్న రోజుల్లో ప్రభుత్వ మానిఫెస్టో లో పెట్టిన సి పి ఎస్ రద్దు పి ఆర్ టి యు బాధ్యత అని పూర్తి హామీ ఇవ్వడం జరిగింది.ప్రభుత్వంతో జరిగిన చర్చల విధముగా జడ్పీజీపీఫ్ కి సంబంధించిన పెండింగ్లో ఉన్న బడ్జెట్ రిలీజ్ కానుందని…పి ఆర్ టి యు అందరినీ కలుపుకొని అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పెద్ద సంఘం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల అధ్యక్షులుబి.కృష్ణ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి జి.రాజశేఖర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దశందర్, గటాడి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా కార్యదర్శి సాదుల గంగాధర్, మండల అసోసియేట్ అధ్యక్షులు మైసాల సుధాకర్ ,మండల కార్యదర్శి ఇమాముద్దీన్, మహిళా ఉపాధ్యక్షురాలు మమత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.