

జనంన్యూస్. 18.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ లో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న మద్యం బెల్ట్ షాప్ లపై చర్యలు తీసుకోవాలి సిరికొండ మండలంలో మద్యం డ్రగ్స్, మత్తుపధార్థలను అరికట్టాలి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు డిమాండ్. గత ప్రభుత్వం అమలు చేస్తే ఈ ప్రభుత్వం ఆచరిస్తుంది విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న మద్యం బెల్ట్ షాప్ లపై చర్యలు తీసుకోవాలని, సిరికొండలో శుక్రవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ మాట్లాడుతు: మారుమూల ప్రాంతమైన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో మద్యం వ్యాపారులు గ్రామాల్లో వీడీసీల ప్రోద్బలంతో తమ అనుకూలమైన వారితో వేలం పాటలు పాడించి తమ అనుచరులతో బెల్ట్ షాపులను నడుపుతూ నాసిరకమైన మద్యం మత్తు పదార్థాలను విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారని వీరిపై చర్యలు తీసుకొని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడం వల్ల యువత మధ్యతరగతి ప్రజలు మత్తులో కోరుకపోయి బానిసలై అనేక ఆగత్యాలకు, నీర సంబంధిత పనులకు కోరుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు మత్తులో ఉన్నటువంటి యువకుల చేష్టల వల్ల భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఎప్పుడు ఎం ప్రమాదం ముంచుకోస్తున్నదో అని ఆందోళన చెందుతున్నరన్నారు. వైన్స్ యజమానుల ముడుపులు మరిగిన ఎక్సైజ్ శాఖ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి వృధా శీనత వైఖరి వల్ల ప్రజలు ముఖ్యంగా యువత బలి పశువులవుతున్నారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్న మద్యం వ్యాపారుల వల్ల మరింత విచ్చలవిడితనం పెరిగింది అన్నారు. వీరి దుచ్చ రేల వల్ల యువత మద్యం మత్తులో మునిగిపోతున్నారన్నారు. బెల్ట్ షాపుల రద్దు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు బాగమని అట్టి విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ ఉచ్చలవిడిగా నడుస్తున్న మద్యం బెల్ట్ షాపులను, డ్రగ్స్ మత్తు పానీయాలను రూపుమాపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రతినిధులు అరికట్టేలాగా చూడాలని కోరుతున్నామన్నారు. సహనం నశించిన ప్రజలు, యువకులు బెల్ట్ షాపుల్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, జి సాయి రెడ్డి, ఈ రమేష్, ఎస్ కిషోర్, బి రాజేందర్, ఎస్ కే సాదుల్లా, ఏం. పండరి, ఎల్. గోపి, ఎం.లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.