

జనం న్యూస్ జులై 18(నడిగూడెం)
మండలం లోని సిరిపురం రైతు వేదిక క్లస్టర్ పరిధిలో శుక్రవారం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక క్యాంపు నిర్వహించారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 11 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు వస్తుందని ఏఈఓ కె.రేణుక తెలిపారు.దీనివల్ల కేంద్రం అందించనున్న ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు చేరుతాయన్నారు.రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.