

జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనమండలి సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు దంపతులు మరియు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి దంపతులు వారికీ ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లo చక్రధర్ రావు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామి వారి ప్రసాదం, ఫోటో ను బహుకరించారు. ఆయన వెంట రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం, తమలంపూడి రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర యువ మోర్చ అధికార ప్రతినిధి పాలూరి జయ ప్రకాష్ నారాయణ, నియోజకవర్గం కన్వీనర్ అయనవిల్లి సత్తిబాబు, స్టేట్ కౌన్సిల్ నెంబర్ శిష్ట కుటుంబ రావు, రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి కలబత్తుల చ్చిన్నారీ, మాజీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, మండల అధ్యక్షులు u. వెంకటేశ్వరరావు, సంపతీ కనకేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దం శెట్టి శ్రీనివాస్, పెన్నాడా చిన్నా, బొర్రా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

