Listen to this article

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

జనం న్యూస్,జూలై19, అచ్యుతాపురం:


అచ్యుతాపురం మండలంలో గల జడ్పి అతిధి గృహాన్ని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల వైద్యం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఆసుపత్రిలో అన్ని వార్డులు తిరిగి పలు రికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు.రోగులకు అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది సమస్యలను విన్నారు. జిల్లా పరిషత్ అతిధి గృహాన్ని ఎమ్మెల్యే సందర్శించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.