Listen to this article

మండల స్థాయి సర్కిల్ స్థాయి జిల్లాస్థాయి పోటీలు

జనం న్యూస్ జూలై 19 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలం పోలీసు స్టేషన్ అధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని బీర్పూర్ ఎస్సై రాజు తెలిపారు. తేదీ 21 .07. 2025రోజున బీర్పూర్ జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్లో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి బెస్ట్ టీం ను సర్కిల్ స్థాయికి పంపుతామని, తర్వాత బెస్ట్ టీం ను జిల్లాస్థాయి టోర్నమెంట్ కు పంపి అక్కడ జిల్లాస్థాయి పోటీలు నిర్వహణ జరుగుతుందని తెలిపారు.తేదీ 21 7 2025 రోజున బీర్పూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో జరిగే మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కు మండల పరిధిలోని గ్రామాల యువత 20-07-2025 రోజున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రిజిస్ట్రేషన్ చెసుకోవాడానికి 8712525013 నెంబర్ కు కాల్ చెసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని బీరు పూర్ లో జరిగే వాలీబాల్ టోర్నమెంట్ యువత పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆకాంక్షించారు.