

జనం న్యూస్:19 జులై శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి
:శాతవాహన యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో అట్ల సాత్విక న్యూట్రిషన్ మరియు డైటెటిక్స్ విభాగంలో డిస్టింక్షన్ సాధించి తన ప్రతిభను చాటింది. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల చైర్మన్ వి. రవీందర్ రెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపల్ గోలి శ్రీనివాస్ అట్ల సాత్విక ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినుల కోసం కళాశాల అందిస్తున్న నాణ్యమైన బోధన, గైడెన్స్ ఫలితంగా ఈ విజయం సాధ్యమైందని అట్ల సాత్విక తెలిపారు.