Listen to this article

బిచ్కుంద జూలై 19 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఎల్లారం తాండలో

నిర్మించిన నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం నాడు

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్‌వాడీల సేవలను ఆయన అభినందించారు.
అంగన్వాడీల బలోపేతం, ఆధునీకరణ దిశగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్. డెలికేట్ విట్టల్ రెడ్డి బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు