

. జనం న్యూస్ ;19 జులై శనివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి.వై.రమేష్;
ఆషాడ మాసంలో నిర్వహించే బోనాల పండుగను అతి వైభవంగా ఇందిరమ్మ కాలనీలో మోడల్ నలంద స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలిపల్లి హరినాథ్ మాట్లాడుతూ బోనాల యొక్క విశిష్టతను తెలిపి ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పులిమేర దేవతలకు ఇంటి దేవతలకు బోనాలను సమర్పించి మన చుట్టూ ఉన్న వివిధ కష్టాలను తొలగించి మన ఊరు వాడ ఇల్లు అన్నిటినీ కాపాడవలసిందిగా అమ్మవారిని కోరుతూ ఈ బోనాల పండుగను నిర్వహించుకుంటున్నాము విద్యార్థిని విద్యార్థులు చక్కటి బోనాలను తయారు చేసుకొని అమ్మవార్లను కొలువుదీరాలని పాఠశాలలో విద్యార్థులు అంతా కలిసి ఈ బోనాల పండుగను నిర్వహించడం జరిగింది ప్రతి టీచర్ కూడా పిల్లలతో బోనాల గురించి తెలియజేసి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఇందులో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు డైరెక్టర్ నిత్యశ్రీ ఉపాధ్యాయులు గౌసియా బేగం అనిత శిరీష నాగరాణి అంజలి అమృత పాల్గొన్నారు.