

జనం న్యూస్; 19 జులై శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్
;భారత్ నగర్ లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో ఆషాడమాస బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణ లో పాల్గొని పాథశాల వాతవరణాని పండుగలా మార్చారు. పోతరాజుల వేషధారణ లోని విద్యార్థులు డప్పు మేళ తో వివిధ రకాల నృత్యాలు చేసి అలరించారు.ఈ కార్యక్రమము నుద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మన సంప్రదాయాలు తెలుసు కోవడము పాటించడము ద్వారా పిల్లలకు విలువలు పెరిగి సంస్కృతి పట్ల గౌరవము ఏర్పడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమము లో కరెస్పాండంట్ లిఖిత,ఉపాధ్యాయినులు వాణి శ్రీ, రత్నమాల,దేవిక,రేఖ,అష్షూ,సమతా,శ్రీ లతా,మానుష పాల్గొన్నారు.