Listen to this article

జనం న్యూస్ జూలై 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం చట్టం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ ఎండ్ వర్కర్స్ యూనియన్ మునగాల మండల ద్వితీయ మహాసభలు సుందరయ్య భవనంలో ఎల్ నాగార్జున అధ్యక్షతన జరిగినవి.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు మాట్లాడుతూ‌‌.. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వలు గత 30సం 40 సంవత్సరాల నుండి ఎట్టి చేయించుకుంటూ పర్మినెంట్ చేయకుండా వారిని మోసం చేస్తుందన్నారు గ్రామపంచాయతీ కార్మికులు పారిశుద్ధ నిర్మాణంలో భాగంగా సైడ్ కాలువలు శుభ్రం చేస్తూ మంచినీటిని సరఫరా చేస్తూ వీధిలైట్లు డంపింగ్ యార్డ్ ట్రాక్టర్ నిర్వహణ చెట్ల పెంపకం తదితర పనులు చేయుచుకుంటున్నారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని జీవో నెంబర్ 51 ని సవరించాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గ్రామపంచాయతీ కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారని తమ మేనిఫెస్టో పెట్టుకున్నారని దానిని వెంటనే అమలు చేయాలని కోరారు.