

జనం న్యూస్ జులై 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆదివాసీలను, ఆటవి పారంపర్య కుటుంబాలు, దశాబ్దాలుగా సాగు చేసుకుని జీవిస్తున్న కుటుంబాలను, వారి నివాస ప్రాంతాలను, వారి జీవవైవిద్యాన్ని, వారికి జీవికగా ఉన్న భూముల నుండి అడవుల నుండి గెంటివేసే కన్సర్వేషన్ ఫారెస్ట్ 49,జీవో, ను రద్దు చేయాలి. బూటకపు గ్రామసభ తీర్మానాలు చేసి ఆదివాసి లు పోరాడి సాధించుకున్న 1/70, పెస, అటవీ హక్కుల చట్టం 2006, రాజ్యాంగం లో ని షెడ్యూల్ 5, చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం దుర్మార్గంగా 49 జీవోను తేవడం ఆదివాసి ఆటవిని నమ్ముకున్న ఆదివాసీ,ఆదివాసేతర ప్రజల జీవించే హక్కులను హరించడమే. పోడు రైతులపై పోడు భూములపై ఆటవిశాఖ అధికారులు దాడులు చేస్తుంటే వారి వద్దకు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్న పాలకవర్గ పార్టీలవి కపట నాటకాలే, వారి వారి ప్రభుత్వాలే ఆదివాసీ హక్కులను హరిస్తూ ఉన్న చట్టాలను సవరిస్తూ ఆదివాసులను వారి జీవన వైవిధ్యాన్ని, వారి జీవితం విధ్వంసం చేసే చట్టాలు చేస్తున్నది వారి పార్టీలే, వారి వారి స్వార్థ ప్రయోజనాలు వారి ఓట్లు సీట్ల రాజకీయాలం కోసం పోడు రైతుల వద్దకు వచ్చి మొసలి కన్నీరు కార్చడం తప్ప వారి పాలకవర్గ పార్టీలు చేసిన ఆదివాసి చట్టాలను రద్దు చేయాలని చెప్పే చిత్తశుద్ధి వారిలో లేదు. ఆదివాసి ల మధ్య, ఆదివాసీలను ఐక్యం చేసే సంఘాల మధ్య ఉన్న అనైక్యతలను సొమ్ము చేసుకోవడం, వారి ఓట్ల కోసం ఆదివాసీలను మభ్యపెట్టడం తప్ప ఆదివాసీలను వారిపై జరుగుతున్న దాడుల పై ఐక్యం చేసి ఉద్యమాలు నిర్మించే చిత్తశుద్ధి వారికి లేదు.కాబట్టి ఓట్లు సీట్ల రాజకీయాలను పక్కన పెట్టాలి. సర్పంచ్,ఎంపీటీసీ, జెడ్ పి టి సి, ఎన్నికల్లో 49 జీవోను రద్దుచేసి ఓట్లు అడుక్కోవాలని, ఎన్నికలకు రావాలని మనం డిమాండ్ చేయాలి. దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాల పారిశ్రామిక విధానంలోనే అడవిని ధ్వంసం చేసి విధానాలు ఉన్నాయని వందలు వేలు లక్షల ఎకరాలు కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, ఆటవి భూభాగంలో ఉన్న దాదాపు 80 రకాల ఖనిజాలు వారికి కావాలని వాటిని అంబానీ లాంటి కార్పొరేట్లకు దోచి పెట్టాలని, మోడీ ప్రభుత్వం భావిస్తున్నది, ఆటవిని, దాంట్లో ఉన్న సంపదకు ఆదివాసుల రక్షణగా ఉన్నారు కనుకనే, టైగర్ జోన్ పేరుతో, అటవీ సంరక్షణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను వారి నివాసాల నుండి వారి భూముల నుండి వారి జీవన వై వైద్యం నుండి వారి జీవిక నుండి బలవంతంగా గెంటివేసే దుశ్చర్యకు పాల్పడుతున్నాయి. వీటికి అనుకూలంగానే 1972, 73, 1980, ఆటవి సంరక్షణ విధానాల్లో మార్పులు తీసుకొస్తూ మోడీ ప్రభుత్వం 2022 ఆటవి సంరక్షణ నియమాలను తీసుకువచ్చింది,అనేది మనం గ్రహించాలి.
వీటికి వ్యతిరేకంగా సమరశీల సంఘటిత ఐక్య పోరాటాలు చేయకుండా వీటిని తరిమికొట్టలేమని, దీనికి సంఘటితమైన బలమైన ప్రజా ఉద్యమమే సరైన జవాబు చెబుతుందని గమనించాలని, మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగం జరిపిన పోరాటాన్ని స్ఫూర్తిగా మనం తీసుకోవాలి అన్నారు
49, జీవో, కు వ్యతిరేకంగా జులై 21,న జరుగుతున్న బంధను విజయవంతం చేయాలని కొమురం భీం జిల్లా సిపిఐన్యూడెమోక్రసీ పార్టీ ఈ బందుకు సంఘీభావాన్ని ప్రకటించారు.