Listen to this article

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ 21/7/2025

జోగిపేట్ పట్నంలో రెండో వార్డ్ ఇంద్ర నగర్ కాలనీలో నిర్వహించే ఆషాడ మాస బోనాల ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి స్వగృహంలో కలిసి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది, కాలనీ గౌరవ అధ్యక్షుడు చౌదరిపేట ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాకూరి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పిట్ల లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ నాయకులు కోషికే రాజశేఖర్, కొత్తపల్లి యాదగిరి, ఆనంద్ మరియు కాలనీవాసులు ఆహ్వాన పత్రికను అందించడం ద్వారా దామోదర్ రాజనర్సింహ తప్పకుండా వస్తానని, సానుకూలంగా స్పందించి, బోనాల వేడుకలో పాల్గొంటానని తెలిపారు.