

(జనం న్యూస్ 21 జూలై ప్రతినిధి కాసిపేట రవి)
హైవే రోడ్ డివైడర్ ఇరువైపులా ఉన్న కోనో కార్పస్ . చెట్లు ఆరోగ్యానికి హానికరమని, ఈ చెట్ల వల్ల భూగర్భ జలాలు కలుషితం అయితాయని పరిశోధనలో తేలింది.చాలా రాష్ట్రాలలో ఈ చెట్లను బ్యాన్ చేశారు . గతంలో శాసనసభలో సభాపతి గడ్డం ప్రసాద్ ఈ చెట్లను తొలగించాలని ఆదేశించారు’అధికారులు వెంటనే స్పందించి కోనో కార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని ప్రజలు, వాహనదారులు కోరారు.