Listen to this article

జనం న్యూస్ జులై 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని ఈ పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని రేషన్ డీలర్లు పార్టీ డివిజన్ అధ్యక్షులతో ఆయన గురువారం మూసాపేట్ లోని హిమదుర్గ భవన్ పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రేషన్ డీలర్లు కొందరు సమయపాలన పాటించడం లేదని ఏ రోజు ఇస్తారో కూడా రేషన్ తెలియని పరిస్థితి ఉందని దీంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కొందరు పార్టీ నాయకులు రమేష్ దృష్టికి తీసుకువచ్చారు .గోధుమలు స్టాక్ ఉన్నా లేదని లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఇటీవల ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో రమేష్ డీలర్లతో నాయకులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం సన్న బియ్యం పంపిణీ అని దీనివల్ల ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వచ్చిందని ఇలాంటి పథకాన్ని తప్పకుండా చివరి లబ్ధిదారు వరకు ప్రయోజనం చేకూరాలని రేషన్ డీలర్లకు సూచించారు రేషన్ షాపుల వద్ద సమయపాలనకు సెలవులకు సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందన్నారు షాపు వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ప్రదర్శించాలన్నారు.రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా పేదవాడికి మంచి బియ్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.