

ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
యూఎస్పీసీ డిమాండ్
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 24 :
ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పిసి) ప్రతినిధులు కోరారు.గురువారం తాహశీల్దార్ ల ద్వారా ముఖ్యమంత్రి కి వినతి పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా యుఎస్పిసి నాయకులు టిఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి యం.పుల్లయ్య, టిపిటిఎఫ్ అధ్యక్షులు వెంకటప్పయ్య, టీజీ టిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, పిఆర్సీ ని ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలన్నారు. అదేవిధంగా సిపిఎస్ రద్దుచేసి ఓపియస్ విధానాన్ని అమలు చేయాలని, 317 జీవో వలన నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ వారి సొంత జిల్లాలకు పంపించాలన్నారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పండిట్స్, పిఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని, గిరిజన ఉపాధ్యాయుల బదలీలు, పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని కోరారు.వివిధ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని, కేజీబీవీలు, యుఆర్ఎస్, సిఆర్టి ల సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లోని వివిధ భాగస్వామ్య సంఘాల నాయకులు కేజీబీవీ ఎస్ఓ లావణ్య,జె.పుల్లయ్య, శ్రీదేవి,ఎం.నాగేశ్వరరావు, శంకర్రావు, శ్యాం కుమార్,కేజీబీవీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.