

జనం న్యూస్ జూలై 24 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడ్ లోని వివిధ ఫర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ గారు సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఎరువులు విత్తనాల విక్రయాల డీలర్లు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు దుకాణాలలోని రిజిస్టర్ లను తనిఖీ చేసి పరిశీలించారు స్టాక రిజిస్టర్ ను రోజువారి అప్డేట్ చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్ గౌడ్ గారు ఏఎస్ఐ రాములు తదితరులు పాల్గొన్నారు