

మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని-ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ జూలై 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా వాహనదారులు, రైతులు, ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు,ముట్టుకోకుండా, అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రయాణ సమయంలో రోడ్లు, వంతెనలు తెగిపోయిన రాకపోకలకు ఆటంకాలు ఎదురైతే పోలీస్ అధికారులకు తెలపాలని కోరారు. చెరువులు, వాగులు, కుంటలు, నీటితో నిండి ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించినప్పుడు వాటిని దాటే సాహసం చేయరాదన్నారు.పాత పాడుబడ్డ ఇళ్లలో నివసించరాదని,బావుల వద్ద జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు 100 కాల్ చేస్తే ప్రత్యేక సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపారు.