

బిచ్కుంద జులై 24 జనం న్యూస్
ప్రాథమిక పాఠశాల ఉపధ్యాయుల సముదాయ సమావేశానికి జిల్లా విద్యా శాఖ అధికారులు వార్షిక సమన్వయకర్త వేణుగోపాల్ , సమాజ సమీకరణ అధికారి నగవేందర్, నిర్వహణ సమన్వయక్త కృష్ణ చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంపొందించాలి అని అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల విద్యాశాఖ అధికారి ఏ సి నివాస్ రెడ్డి ,సముదాయ ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్ కుమార్ ఆర్పీలు నాగభూషణం పండరి వివిధ పాఠశాల ఉపాధ్యాయులు సిఆర్పి ప్రమోద్ పాల్గొన్నారు