Listen to this article

జనం న్యూస్ జూలై 24:,నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండలకేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుతూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఏనుగందుల రాజాపూర్ణనందం మాట్లాడుతూ కేటీఆర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు అదేవిదంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ఐటీ సంస్థలు, పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షించేలా చేసిన కృషి అమోఘమని అన్నారు. ప్రత్యేకించి తెలంగాణా అభివృద్ధి దిశగా ఆయన ముందుచూపుతో నూతన ప్రణాళికలు రూపొందించి, వాటిని విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, ఏర్గట్ల మాజీ ఎంపీటీసీ జక్కని మధుసూదన్, తాళ్ళరాంపూర్ మాజీ సర్పంచ్ భీమానాతి భానుప్రసాద్,తాళ్ళరాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.