

జనం న్యూస్ జులై 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
మండలంలోని డా.ఎల్లాల అంజిత్ రెడ్డి మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో రంగారావుపేట గ్రామంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడమైనది. గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి దీని యొక్క ప్రాముఖ్యతను ఇంటింటికి వెళ్లి డాక్టర్ మరియు సిబ్బంది అవగాహన కల్పిస్తూ పరిసరాలలో నీరు నిల్వ ఉండడం వల్ల దోమల వ్యాప్తి పెరుగుతుందని దానివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గన్యా, మెదడు వాపు లాంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని ఇంటి పరిసరాలలో నీరు ఉండకుండా డ్రై డే నిర్వహించాలని ఇంటి పరిసరాల్లో ఉండే చిప్పలు, టైర్లు, పూల కుండీలు, నీటి తొట్టిలు , కూలర్లు మొదలైన వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్నట్లయితే దోమల వల్ల వచ్చే వ్యాధులు నివారించవచ్చని అన్నారు.
అలాగే ఇంటింటికి వెళ్లి అసంక్రమిత వ్యాధుల ( నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ) బిపి ,షుగర్ పరీక్షలు నిర్వహించనైనది మరియు ఫీవర్ సర్వే లో జ్వరంతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రియదర్శిని, పంచాయతి సెక్రటరీ కళ్యాణ్, అంగన్వాడి సుమలత, ఆశ వర్కర్ మమత పాల్గొన్నారు