

జనం న్యూస్ 25 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం రైల్వే స్టేషన్‌లో సెల్ ఫోన్ల దొంగను జీఆర్పీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
విశాఖ జీఆర్పీ డీఎస్పీ పి.రామచంద్రరావు ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని ఎస్.ఐ వి.బాలాజీ రావు తెలిపారు. ఈ తరుణంలో విశాఖలోని ప్రహ్లాదపురానికి చెందిన దున్న లక్ష్మణ్ తమను చూసి పారిపోతుండగా పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుంచి రూ.లక్ష రూపాయలు విలువ చేసే 4 ఫోన్లు సీజ్ చేసి విశాఖ రైల్వే కోగ్టుకు తరలించామని వెల్లడించారు.