

జనం న్యూస్ 25 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఆటో వర్కర్ల సమస్యలపై చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేశ్ అన్నారు. విజయనగరం కోట జంక్షన్ వద్ద కనకదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ సంబంధించిన గోడపత్రికను గురువారం ఆవిష్కరించారు. సురేశ్ మాట్లాడుతూ… ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ఇవ్వాలన్నారు.