

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ప్రాంతీయ కార్యాలయంలో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మల్లెల శివ నాగేశ్వరావును ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం అందరూ మల్లెల శివ నాగేశ్వరావును పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది