

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా కమిటి సభ్యునిగా కాకాని రోశయ్యను ఎన్నుకోవడం జరిగింది. తన నియామకానికి సహకరించిన పల్నాడు జిల్లా కమిటీ నాయకులకు, ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర అధ్యక్షులు లాకె రాజారావుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో కమిటీ సభ్యునిగా నియమించారని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తానని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని రోశయ్య తెలిపారు.