Listen to this article

జనం న్యూస్ జూలై 25 ( కొత్తగూడెం ఆర్ సి)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో గల కొత్తగూడెం టు టౌన్ పరిధి సిపిఐ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణ కార్యదర్శిగా తూముల శ్రీనివాస్ ని కొత్తగూడెం శాసనసభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ఎస్ కె సాబీర్ పాష, గ ఇటీవల కొత్తగూడెం లో జరిగిన సిపిఐ పార్టీ మహాసభల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది , తూముల
శ్రీనివాస్ అభ్యుదయ కవి, రచయిత, గాయకుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొత్తగూడెం ప్రాంతంలో అన్ని వర్గాల వారిని సమన్వయం చేయడంలో సుపరిచితుడుగా ఉన్నందువల్ల వారికి ఈ అవకాశం కల్పించడం జరిగిందని పార్టీ అభ్యున్నతి కోసం ప్రజాసంఘాల నిర్మాణం కోసం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని అందులో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులు మేషన్ కార్మికులు అమాలి కార్మికులు చిన్నవ్యాపారస్తులు అసంఘటిత రంగ కార్మికులందరినీ సమన్వయ పరుస్తూ వారి సమస్యల సాధన కోసం కృషి చేస్తూ సంఘాల నిర్మాణాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని ఈ సందర్భంగా తూముల శ్రీనివాస్ అన్నారు, తన ఎంపిక పట్ల సిపిఐ పార్టీ రామవరం కొత్తగూడెం శ్రేణులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు