

జనం న్యూస్- జూలై 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
అనేక రకాల వ్యాధులకు కారణమైన దోమల నియంత్రణ, నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నందికొండ మున్సిపల్ కమిషనర్ గురులింగం అన్నారు మున్సిపాలిటీలో దోమల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు అయన తెలిపారు.శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గురు లింగం ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పర్యావరణ ఇంజనీర్ బాలాజీ ఆధ్వర్యంలో గడపగడపకు తిరిగి దోమలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఇంటి పరిసరాలలో దోమలు పెరగకుండా కుట్టకుండా ఎక్కడా నీటి నిల్వ లేకుండా చేసుకోవాలని పాత టైర్లు, పాత కూలర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, టెంకాయ బొచ్చలలో నీరు నిల్వ లేకుండా చేసుకోవాలని సాయంత్రం ఆరు తర్వాత గృహలలో కిటికీలు తలుపులు మూసుకోవాలనిమలేరియా, చికున్ గున్యా, డెంగీ వంటి వ్యాధులు ప్రధానంగా దోమల వల్లనే వ్యాపిస్తాయని, దోమలను నివారించడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని ముఖ్యంగా
నీటి తొట్టెలు కొబ్బరి చిప్పలు వాడిపడేసిన ప్లాస్టిక్ వస్తువులు నీళ్ల డ్రమ్ములు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని వారన్నారు పరిసరాలను ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని డ్రైగా ఉంచుకోవడం వల్ల దోమలను అధిక శాతం నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు సంధ్య, రమేష్, శానిటైజేషన్ సూపర్వైజర్ వెంకట్ రెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు లక్ష్మణ్, నాగ భాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.