

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తాం
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామాన్ని ఇందిరమ్మ పైలెట్ గ్రామాగా ఎంపిక చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పత్రాలను అందజేశారు.తాడువాయి రెవిన్యూ పరిధిలో 1092 మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా నేడే ఎకరానికి 12000 చొప్పున కోటి 65 లక్షలు రైతుల ఖాతాలలో జమ అవుతాయని తెలిపారు.109 లబ్ధిదారులను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హులుగా ప్రకటించారు, 243 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేశారు, 121 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో తహసిల్దార్ ఆంజనేయులు, మండల ప్రత్యేక అధికారి శిరీష, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,డి ఎల్ పి ఓ యాదగిరి, ఏడిఏ ఎల్లయ్య, ఏపీవో రాజు,ఏఈఓ భవాని, ఏపీఓ శైలజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎలక నరేందర్ రెడ్డి, కాసర్ల కోటేశ్వరరావు, కొలిశెట్టి బుచ్చి పాపయ్య, వేనేపల్లి వీరబాబు, మాతంగి బసవయ్య, జిల్లెపల్లి వెంకటేశ్వర్లు, సోమపంగు గోపి, గీత రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.