

జనం న్యూస్ జూలై 26 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.శుక్రవారం మునగాల మండల కేంద్రం లోని పి హెచ్ సి ని సందర్శించారు.ఈ సందర్బంగా కలెక్టర్ ఆస్పత్రి లో వైద్య సేవలు తీసుకుంటున్న నేపాలు నుండి వలస వచ్చిన భవాని దేవి,మునగాల వాసి వెంకట్రాములు తో మాట్లాడి వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.టి హబ్, ఫార్మసి స్టోర్, లేబర్ రూమ్ పరిశీలించారు. ఎ యన్ ఎం,ఆశ కార్యకర్తలు సీజనల్ వ్యాధులపై అలాగే ప్రభుత్వ హాస్పిటల్ లో సాధారణ ప్రసూతి సేవలు పెంచేలా వైద్యాధికారులు కృషి చేయాలని అన్నారు..డెంగ్యూ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకి అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్యం పనులు చేస్తూ పరిశుభ్రత పాటించాలని డెంగ్యూ వ్యాధి గుర్తిస్తే వారి ఆవాసం నుండి 100 మీటర్ల పరిధిలో శానిటేషన్ చేపించటం జరుగుతుందని తెలిపారు.వనమహోత్సవం లో భాగంగా మునగ మొక్కని నాటి సర్వ రోగ నివారణి మునగ చెట్టు అని మునగ యొక్క లాభాలు తెలిసేలా ఆ చెట్టు వద్ద బోర్డు ఏర్పాటు చేయాలని,ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్న మహిళలకి మునగ చాలా ఉపయోగం అని తెలిపారు.

