

జనంన్యూస్. 25.సిరికొండ.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లోని మైలారం. ఈరోజు ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో . గ్రామ శివారులోని ఆయిల కుంట ఒడ్డు పక్కన చెట్ల పొదలలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మగ వ్యక్తి శవం కనిపించినది. మృతదేహాన్ని పరిశీలించగా, వయస్సు సుమారుగా 35-40 సంవత్సరాలు ఉండి, ఎత్తు సుమారు 5.5 అడుగులు, ఒంటిపై బూడిద రంగు జీన్స్ ప్యాంట్ మరియు కాఫీ పొడి రంగులో డబ్బాలు గల గీతల షర్ట్ ధరించినట్లు గుర్తించినారు.ఈ విషయమై మైలారం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ సిరికొండలో కేసు నమోదు చేసి దర్యాప్తు రంభించబడినది.
అట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తు పట్టినచో లేదా సంబంధిత సమాచారం తెలిస్తే వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు తెలియజేయగలరు:CI, ధరపల్లి సెల్ నెం: 87126 59855.SI, సిరికొండ సెల్ నెం: 87126 59857