Listen to this article

కంగ్టి ఎస్ఐ దుర్గ రెడ్డి,

జనం న్యూస్,జులై 26,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి శనివారం మండల ప్రజలకు సూచన మండలం పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు.వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు ఎవరు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు,వంకలు, చెరువులు లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదని అన్నారు. విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగల నుంచి ముట్టకుండా దూరంగా ఉండాలని అన్నారు.ఏదైనా ప్రమాదకర పరిస్థితి జరిగినట్లయితే వెంటనే 100 నంబరుకు సమాచారం ఇవ్వాలని అన్నారు. పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దే ఉంచండి. ఆటల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలలో వశించే ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అన్నారు.ప్రమాదకర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్,రెవెన్యూ అధికారులను సంప్రదించాలని అన్నారు.నేటి సమాజంలో జరుగుతున్న మోసపూరిత, ప్రాణాంతక,అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించి తనను తాను కాపాడుకోవడంతో పాటు,ఇతరులను కాపాడడానికి ఈ క్రింద తెలిపిన నెంబర్లు ప్రతి వ్యక్తికి ఉపయోగపడే ఫిర్యాదు టోల్ ఫ్రీ నంబర్లను ఉపయోగించి సమాజంలో జరుగుతున్న మోసపూరిత, ప్రాణాంతక,అత్యవసర, సేవలను ఉపయోగించుకోవడంలో టోల్ ఫ్రీ నెంబర్లను వినియోగించాలని అన్నారు.సీఎం ఫిర్యాదు పోర్టల్ 181,విద్యుత్ సేవ 1912,జంతు సేవ1962,పోలీస్ సేవ 112,100,అగ్నిమాపక సేవ101,అంబులెన్స్ సేవ102,ట్రాఫిక్ పోలీస్103,విపత్తు నిర్వహణ108,చైల్డ్ లైన్1098, రైల్వే విచారణ139, అవినీతి నిరోధకం1031,రైలు ప్రమాదం1072,రోడ్డు ప్రమాదం1073,సీఎం హెల్ప్‌లైన్1076,క్రైమ్ వ్యంగ్యం1090, మహిళల హెల్ప్‌లైన్ 1091,భూకంపం1092, పిల్లల దుర్వినియోగ సహాయం1098,రైతు కాల్ సెంటర్1551,పౌర కాల్ సెంటర్ 155300,రక్త బ్యాంకు 9480044444, సైబర్ క్రైమ్1930,