

(జనం న్యూస్ 26 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ ,మండల తాసిల్దార్ సదానందం , మరియు ఎస్ఐ,కే, శ్వేత మండల టాస్క్ఫోర్స్ టీం గా ఏర్పడి ఎరువుల గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు రైతులకు యూరియా సరఫరా లో ఎలాంటి కొరత లేకుండా చూడడమే ఈ టాస్క్ఫోర్స్ టీం యొక్క ఉద్దేశమని, కృత్రిమ కొరత లేకుండా చూడడం , ఎరువుల దుకాణాల ముందు స్టాక్ బోర్డు, ధరల పట్టిక తప్పకుండా ఉండాలని ఆదేశించారు.వ్యవసాయ అవసరాలకు తప్ప ఏ ఇతర అవసరాలకు యూరియా అమ్మ వద్దని అధికారులు తెలిపారు.