

జనం న్యూస్ జూలై 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
84 వ వార్డు సాలాపువాని పాలెం గ్రామంలో 1.39 కోట్లకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జీవీఎంసీ పీలా శ్రీనివాసరావు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ 84 వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి నీలబాబు సమక్షంలో కార్యక్రమాలుకు శ్రీకారం చుట్టారు. వార్డు ఇన్చార్జ్ మాదంశెట్టి నీలబాబు మాట్లాడుతూ 27.90 లక్షలతో సిసి రోడ్డు కాలువలు కల్వర్టు 14.96 లక్షలతో వాటర్ ట్యాంక్ కు ప్రారంభోత్సవాలు చేశారని, 50.09 లక్షల విలువ గల అభివృద్ధి పనులకు ఇంటర్నల్ రోడ్స్, కాలువలు కల్వర్టు లకు శంకుస్థాపన చేశారని నీలబాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో రహదారులు మొదలవుతున్నాయని, విశాఖ రైల్వే జోన్ డిపిఆర్ ఆమోదించారని , విశాఖ మెట్రో పనులకు టెండర్లు పిలవడం జరిగిందని, అనకాపల్లి జిల్లాలో పార్లమెంట్ పరిధిలో అనేక కార్యక్రమాల రూపుదిద్దుకుంటున్నాయని పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పైల జగన్నాధరావు సాలాపు మోహన్ తలారి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.//