Listen to this article

జనం జులై 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లి,ఉమ్మడి జిల్లా 1990 బ్యాచ్‌కు చెందిన అనకాపల్లి జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న 25 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐ (అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్) హోదాలో పదోన్నతి కల్పించడమై జిల్లా పోలీసు శాఖ గర్వపడుతుందని వీరిలో 16 మంది అనకాపల్లి జిల్లా పోలీస్ యూనిట్ కు, 9 మంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ పదోన్నతి పొందిన సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి, తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ, పదోన్నతి పొందిన అధికారులను అభినందిస్తూ మాట్లాడుతూ – “పదోన్నతి అనేది కేవలం గౌరవం మాత్రమే కాదు, బాధ్యతల భారం కూడా. కొత్త హోదాలో మరింత నిబద్ధతతో, క్రమశిక్షణతో, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆశిస్తున్నాను. మీరు తమ పనితీరును నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను మెరుగుపరచాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు. జీవితాంతం సేవలందించిన వారి కృషికి ఇది ప్రతిఫలంగా నిలుస్తూ, ఈ పదోన్నతులు ఇతర సిబ్బందికి కూడా ప్రేరణగా నిలుస్తాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ బీమా భాయ్ మరియు పదోన్నతి పొందిన సిబ్బంది పాల్గొన్నారు.