

జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అయినవిల్లి మండలం, కే. జగన్నాధపురం గ్రామం, పిచ్చుక నాగ సత్యనారాయణ అనారోగ్య కారణాల రీత్యా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబీ మాస్టర్) ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్,, వానపల్లిపాలెం గ్రామానికి చెందిన* నల్లా మణికంఠ గారిదంపతుల
సహకారంతో నిత్యవసర వస్తువులు గ్రామ పెద్దల చేతుల మీదుగా అందించడం జరిగింది. దీనికి గాను అతను,మణికంఠ గారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు💐👏🙏 ఈ సందర్భంగా బాబీ మాస్టర్ మాట్లాడుతూ నా మిత్రులు సూరపురెడ్డి సురేష్ గత ఐదు సంవత్సరాల నుంచి సుమారు 500 కుటుంబాలకు ఇలా వివిధ సేవా కార్యక్రమాల రూపంలో అభాగ్యులకు కోనసీమ వ్యాప్తంగా సహకారం చేయడం జరుగుతుంది. అలాగే అయినవిల్లి మండలంలో 50 కుటుంబాలకి నా మిత్రుని ద్వారా సహాయం చేయించాను. ఈ కార్యక్రమంలో నల్లా సత్తిబాబు, జిలగం మల్లిబాబు, నల్లా శ్రీను, అల్లక రాంబాబు, మిద్దె రవి, ఎర్రంశెట్టి కృష్ణ, యనమదల వెంకటరమణ , నల్లా గణేష్ మరియు కంచర్ల స్వామి గారు పాల్గొన్నారు.
