Listen to this article

జనం న్యూస్- జులై 26 నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –

నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈనెల 29న శ్రావణ మంగళవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అర్చకులు రాదయ్యచార్యులు, వెంకట కృష్ణమాచార్యులు తెలిపారు. శ్రావణ మంగళవారం రోజున గోదా తిరు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు తోపాటు కలశ స్థాపన, 108 మంది ముత్తైదువులతో లక్ష కుంకుమార్చన,లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్ర పారాయణం, లక్ష్మి అష్టోత్తర పారాయణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించి దేవాలయానికి రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.