

జనం న్యూస్, 26 జూలై 2025, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి సబ్సిడీ ద్వారా, మహీంద్రా ఆల్ఫా డీలక్స్, బి. యస్. 6 డీజిల్ ప్యాసింజర్ ఆటోలను పంపిణీ చేశారు.
ఈ ఆటోలు, ప్రయాణంలో మార్గమధ్యలోనే ఆగిపోతున్నాయని, ఫిర్యాదులు రావడంతో, , మహీంద్రా షోరూం వాహన విక్రయదారులు, ఈ ఆటోలను విక్రయించడం దాదాపు గత మూడు సంవత్సరాలుగా నిలిపివేశారని,
తయారుచేసిన ఈ నాసిరకమైన వాహనాలను, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, లబ్ధిదారులకు అందించి, ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులను మోసం చేశారని, ఈ ఆటోలు ప్రయాణంలో మార్గమధ్యంలోనే, ఎన్నోసార్లు ఆగిపోవడంతో, వీటిని బాగు చేసుకోలేక, బ్యాంకులో మిగిలిన అప్పులు తీర్చుకోలేక, తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటోలను పొందిన ఆటో లబ్ధిదారులు ఉన్నారని,
ప్రభుత్వమే స్పందించి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన ఆటో లబ్ది దారులను ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుచున్నారు