Listen to this article

కాట్రేనికోన జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి

కాట్రేనికోన మండల పరిధిలోని చెయ్యేరు గ్రామానికి చెందిన,జనసేన నాయకులు,ఆక్వా రైతు సంఘం సలహాదారుడు,త్సవటపల్లి నాగభూషణం మర్యాద పూర్వకంగా సొసైటీ అధ్యక్షులు గోదాసి పుండరీష్ ను ప్రమాణ స్వీకారంలో కలిసి శాలువ కప్పి అభినందనలు తెలిపారు,సొసైటీ నుండి అన్ని విధాలుగా రైతులకు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నాగ భూషణం విజ్ఞప్తి చేశారు,రానేలంక సొసైటీ అధ్యక్షుడు గోదాసి పుండరీష్ ప్రమాణ స్వీకారలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,ఆయన వెంట నాయకులు కాయల బలరామ్, నంద్యాల సురేంద్ర, తదితరులున్నారు