Listen to this article

పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది.

జనం న్యూస్ 27జులై పెగడపల్లి ప్రతినిధి

జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రంలోని స్థానిక రెడ్డి గార్డెన్స్‌లో శనివారం నాడు నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగారాష్ట్రఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్గొని పెగడపెల్లి మండలానికి మంజూరు అయిన 1079 కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం 62 లక్షల రూపాయలు విలువ గల 62 కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని మండల పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్వహించాలని,అలానే రేషన్ కార్డు రాని వారు కంగారు పడాల్సిన పని లేదని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీసేవాలో కానీ.. లేదంటే ప్రజాపాలనలో మరో సారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత.. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా కలిపేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మళ్లీ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు.ప్రభుత్వ ధాన్యం,నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందించేందుకు ఈ కార్డులు కీలకం కానున్నాయనీ, తద్వారా మరిన్ని పేద కుటుంబాలు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల నుండి లబ్ధిపొందే అవకాశం కలుగనుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, డి ఆర్ డి ఓ రఘువరన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ తహసిల్దార్ రవీందర్ ఎంపిడిఒ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.