

జనం న్యూస్ జూలై 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఉదయం రెండు గంటలు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండని కూకట్పల్లి ఎమ్మెల్యే.
ఇప్పటికీ అధికారులను బెదిరించి నెపం వాళ్ల మీద వేయాలని చూస్తాడు
ఎన్నికల ముందు 90 శాతం అభివృద్ధి చేశాను అని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు పనులే కావటం లేదంటూ డ్రామాలాడుతున్నాడు
హౌసింగ్ బోర్డును ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆ భూముల పరిరక్షణకు ప్రస్తుత ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది.
పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది.
ఎమ్మెల్యే కనుసన్నల్లోనే కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని చెరువులు కుంటలు ఆక్రమించి అమ్ముకొని ఆయన అనుచరులు సొమ్ము చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే నియోజకవర్గ అభివృద్ధికి పది కోట్ల రూపాయలు మంజూరు చేసింది
టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పెద్ద ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే పనిచేస్తుందని టిపిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు మూడుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే కృష్ణారావు రోజుకు రెండు గంటలకు మించి ప్రజలకు అందుబాటులో ఉండడని పేరుపొందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో అభివృద్ధి జరగడంలేదని హౌసింగ్ బోర్డ్ భూములను అమ్ముకుంటున్నారని కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బండి రమేష్ శనివారం మూసాపేట్ లోని హేమ దుర్గాభవాని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన చేస్తోందని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోoదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా 200 కోట్ల మంది మహిళామణులు ప్రయాణం చేశారన్నారు. రూ 500 కే గ్యాస్ 25 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మహిళా సాధికారత దిశగా ఎన్నో కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. వరి వేస్తే ఒరేయ్ అన్న నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేసిందన్నారు రైతు క్షేమంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.23 వేల కోట్ల రుణమాఫీ చేసిందని రైతు భరోసా కింద రూ.9,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించింది అన్నారు. ఇక కుకట్పల్లి నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే కృష్ణారావు సాంకేతికంగా గెలిచినా నైతికంగా ఓడిపోయాడని, అతని గెలుపును తాను అంగీకరించడం లేదని రమేష్ పేర్కొన్నారు కృష్ణారావు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగడం లేదంటూ నానాయాగి చేసే కృష్ణారావు ఎమ్మెల్యేగా గత 11 ఏళ్లుగా నియోజకవర్గానికి ఏం చేశాడంటూ రమేష్ ప్రశ్నించారు. ప్రత్యర్థి వర్గాల ఫోన్లు ట్యాప్ చేయించడం అధికారులను బెదిరించడం ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, బెదిరించడం తప్ప అతను నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని రమేష్ ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాప్ అయిన వారి పేర్లను ఆయన మీడియాకు వెల్లడించారు రోజుకు రెండు గంటలు మించి ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే ప్రభుత్వంపై తరచూ పనికిరాని, పసలేని విమర్శలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. అసలు హౌసింగ్ బోర్డ్ ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని హౌసింగ్ బోర్డ్ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం పలు రక్షణ చర్యలు తీసుకుంటుంది అన్నారు టిఆర్ఎస్ హయంలోనే హౌసింగ్ బోర్డ్ స్థలాలను ప్రభుత్వ స్థలాలను చెరువులు కుంటలు ఆక్రమించి నాయకులు కార్యకర్తలు దోచుకుతిన్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోడ్లు కబ్జా చేసి డబ్బాలు వేయించి వారి నుంచి డబ్బులు వసూలు చేసేది నీ అనుచరులే అని విమర్శించారు. చెరువుల సుందరీకరణ పేరుతో టిఆర్ఎస్ నాయకులు దోచుకోవడానికి దారి చూపారన్నారు. నియోజకవర్గంలోని చెరువులు కబ్జా అయితే వాటిని రక్షించేందుకు హైడ్రా తీసుకువస్తే దానిమీద విషo చిమ్ముతున్నారని పేర్కొన్నారు. డబల్ బెడ్రూంలో కోసం 31 వేలు అప్లికేషన్లు వస్తే 900 మందికి మాత్రమే ఇచ్చారని కైతలాపూర్ లో నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకుండా అలాగే ఉన్నాయన్నారు. గత 15 ఏళ్లలో పేదలకు ఒక్క రేషన్ కార్డు సైతం ఇవ్వలేదని తమ ప్రభుత్వం 28,000 మందికి త్వరలో రేషన్ కార్డు ఇవ్వడం ఉన్నట్లు ప్రకటించారు దేశంలోనే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి ఆయంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు తమ ప్రభుత్వం వచ్చిన నెలలోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ 10 కోట్లు కేటాయించడంతోపాటు మరెన్నో నిధులను మున్సిపాలిటీకి జిహెచ్ఎంసికి ఇవ్వడం జరిగిందన్నారు. పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం లో అభివృద్ధి ఏం జరగలేదని హౌసింగ్ బోర్డ్ లో ఇంకా ఎల్ఐజీ ఇళ్లు రిజిస్టర్ కాలేదని ట్రాఫిక్ సమస్య అలాగే ఉందని, అయితే అభివృద్ధి 90 శాతం పూర్తి అయిందని 26 కులాలను బీసీల్లో కలుపుతామని ఎన్నికల ముందు పెద్ద డ్రామా ఆడాడనీ రమేష్ విమర్శించారు. మూసాపేట వై జంక్షన్, జేఎన్టీయూ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూకట్పల్లిలో పీజీ కాలేజీ ఏర్పాటుకు హౌసింగ్ బోర్డ్ లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎస్సీ వర్గీకరణకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు సమావేశంలో ఏ, బి బ్లాక్ అద్యక్షులు నాగిరెడ్డి తూము వేణు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య పాల్గొన్నారు.
