Listen to this article

జనం న్యూస్ జూలై 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

వాయువ్య బంగాళాఖాతం, బెంగాల్‌ తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చియ వాయువ్య దిశగా కదిలి ఉదయం బెంగాల్‌-బంగ్లా తీరాలను దాటిందని వాతావరణశాఖ తెలిపింది.

సాగర్‌ ద్వీపానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రాబోయే 24గంటల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌ మీదుగా వాయువ్య, పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా వాయుగుండం కేంద్రం వరకు ఉపరితల ద్రోణి సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాగల నాలుగురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది.ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌, వికారాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, వరంగల్‌, జనగాం, జయశంకర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆసిఫాబాద్‌ జిల్లా రవీంద్రనగర్‌లో 7.5, కౌటాలలో 7.4, లోనవెల్లి 6.7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.