Listen to this article

హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి వేరుగా ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ

హర్ష వ్యక్తం చేస్తున్న రైతులు స్థానిక మండల ప్రజలు

మండల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు.

కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేన రెడ్డి.

జనం న్యూస్ 26 జూలై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

అభివృద్ధి రూపురేఖలు మారుస్తున్న హుస్నాబాద్ శాసన సభ్యులు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి కృతజ్ఞతలు అని అన్నారు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇంద్రసేనరెడ్డి శనివారం రోజున మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎల్కతుర్తి హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి అనుబంధ మండలంగా ఉండేదని హుజురాబాద్ దూరం ఉండడంతో రైతులు ఇబ్బంది పడేవారని తెలిపారు ఇక రైతులకు ఇబ్బంది లేకుండా భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాలను వేరుగా చేసి రెండు మండలాలను నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ గా ఎల్కతుర్తిని మంజూరు చేస్తూ జీవో జారీ చేయడానికి కృషి చేసినటువంటి మంత్రికి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు